Mon Feb 02 2026 09:20:44 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ చెప్పినా...జగన్ ను వదిలిపెట్టడం లేదే....!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులకు వైసీపీ అధినేత జగన్ పై ఆగ్రహం చల్లారనట్లుంది. తమ అధినేత ఈ అంశాన్ని ముగిద్దామని చెప్పినప్పటికీ పవన్ ఫ్యాన్స్ వినడం లేదు. అనేక చోట్ల జగన్ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. తమ నేతను వ్యక్తిగతంగా దూషించిన జగన్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఈ దిష్టిబొమ్మల దహనం కార్యక్రమం కొనసాగుతుంది.
సోషల్ మీడియాలోనూ......
కాకినాడ లోని ఆలమూరు మండలంలో జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. జనసేనాని మాత్రం ముగింపు పలకాలని చెప్పినా అభిమానులు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతుండటంతో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సయితం జగన్ కుటుంబ సభ్యులపై వ్యక్తిగత ఆరోపణలకు దిగుతుండటంతో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది.
- Tags
- andhra pradesh
- ap politics
- bharathiya janatha party
- janasena party
- nara chandrababu naidu
- narendra modi
- pavan kalyan
- social media
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- దిష్టిబొమ్మల దహనం
- నరేంద్ర మోదీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- భారతీయ జనతా పార్టీ
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
- సోషల్ మీడియా
Next Story
