Mon Mar 23 2026 09:45:39 GMT+0530 (India Standard Time)
సీబీఐ కోర్టుకు జగన్...ఎలా వచ్చారంటే?

వైసీపీ అధినేత జగన్ ఈరోజు హైదరాబాద్ వచ్చారు. సీబీఐ కోర్టులో హాజరయ్యేందుకు ఆయన నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. ఈరోజు శుక్రవారం కావడంతో జగన్ పాదయాత్రకు విరామమిచ్చి కోర్టుకు హాజరయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ ప్రతి శుక్రవారమూ సీబీఐ కోర్టుకు హాజవుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రం వరకూ జగన్ కోర్టులోనే ఉంటారు. సాయంత్రం బయలుదేరి తిరిగి కృష్ణా జిల్లాకు వెళతారు. రేపటి నుంచి పాదయాత్ర యధాతధంగా ఉంటుంది.
Next Story

