Sat Jan 31 2026 18:46:30 GMT+0000 (Coordinated Universal Time)
రెండు రోజుల తర్వాత జగన్....?

రెండు రోజుల విరామం అనంతరం జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర నేడు ప్రారంభమైంది. భారీ వర్షం కారణంగా గురువారం, కోర్టుకు హాజరవ్వాల్సిన కారణంగా శుక్రవారం జగన్ పాదయాత్రకు విరామమిచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం కోర్టులో విచారణ పూర్తయిన అనంతరం ఆయన నేరుగా తూర్పుగోదావరి జిల్లాకు చేరుకున్నారు. ఈరోజు పాదయాత్ర యధాతధంగా ప్రారంభమైంది. 201వ రోజుకు చేరుకున్న పాదయాత్ర ఈరోజు అమలాపురం నియోజకవర్గంలో పర్యటించనుంది.
నేడు యాత్ర జరిగే ప్రాంతాలు......
ఈరోజు ఉదయం భీమనపల్లి శివారు నుంచి జగన్ పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి సింగాయపాలెం, అనంతవరం, మహిపాల చెరువు వరకూ చేరుకుంటారు. భోజన విరామం అనంతరం ఆయన బొండయకొడు, కొండలమ్మల చింత మీదుగా ముమ్మడి వరం వరకూ పాదయాత్ర చేయనున్నారు. ముమ్మడి వరంలోనే జగన్ రాత్రికి బస చేయనున్నారు. అక్కడఈరోజు సాయంత్రం జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు.
Next Story
