Fri Mar 20 2026 02:25:57 GMT+0530 (India Standard Time)
ఢిల్లీకి చేరుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘ నేతలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ గత కొద్దిరోజులుగా ఉద్యమం చేస్తున్న కార్మికులు ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర మంత్రులను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ గత కొద్దిరోజులుగా ఉద్యమం చేస్తున్న కార్మికులు ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర మంత్రులను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు [more]

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ గత కొద్దిరోజులుగా ఉద్యమం చేస్తున్న కార్మికులు ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర మంత్రులను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయరెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాల నేతలను ఢిల్లీకి తీసుకెళ్లారు. కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ కోసం విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించవద్దని వారు కేంద్ర మంత్రులను కోరనున్నారు. ఇప్పటి వరకు వారికి కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ లభించలేదు.
Next Story