Thu Apr 02 2026 15:18:44 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. 11 మంది సజీవ దహనం
హైదరాబాద్ లోని బోయిగూడలో జరిగిన అగ్నిప్రమాదంలో పదకొండు మంది సజీవదహనమయ్యారు. వీరంతా కార్మికులే.

హైదరాబాద్ : హైదరాబాద్ లోని బోయిగూడలో జరిగిన అగ్నిప్రమాదంలో పదకొండు మంది సజీవదహనమయ్యారు. వీరంతా కార్మికులే. బోయిగూడలోని శాధ్వన్ ట్రెదర్స్ గోదాంలో ఈ ప్రమాదం జరిగంది. ప్రమాదం సమయంలో మొత్తం 11 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో పది మంది సజీవ దహనమయ్యారు. వీరిలో ఒకరిని రక్షించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడు కూడా మరణించాడు.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే
షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఎనిమిది ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. మంటల్లో చిక్కుకుని మరణించిన పది మంది కార్మికుల మృతదేహాలను బయటకు వెలికి తీసి పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

