Fri Mar 20 2026 00:27:38 GMT+0530 (India Standard Time)
ఢిల్లీలో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు?
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు ఈరోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. ఈరోజు నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీలో ధర్నా [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు ఈరోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. ఈరోజు నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీలో ధర్నా [more]

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు ఈరోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. ఈరోజు నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీలో ధర్నా చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు గత కొద్ది నెలలుగా మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఆందోళన చేస్తున్న రైతులకు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు తమ మద్దతు తెలపనున్నారు. దీంతో పోలీసులు జంతర్ మంతర్ వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే రైలు దిగి జంతర్ మంతర్ వద్దకు, ఏపీ భవన్ కు చేరుకుంటున్న కార్మికులను పోలీసులు అడ్డుకుంటున్నారు.
Next Story