తెరాస ఆటా ఇటా ...

ఏపీకి న్యాయం చేయాలంటూ పార్లమెంట్ వేదికగా మొదలు కానున్న యుద్ధంలో టీఆరెస్ వ్యూహం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తుంది. గత పార్లమెంట్ సెషన్ లో సభలో అవిశ్వాసం చర్చకు రాకుండా అన్నా డీఎంకే, టీఆరెస్ సభ్యులు కంటిన్యూగా ఆందోళన కొనసాగిస్తూ వచ్చారు. స్పీకర్ పోడియం చుట్టూ చేరి ఆ రెండు పార్టీలు చేసిన గందరగోళం వల్లే లోక్ సభ ఎలాంటి కార్యకలాపాలు లేకుండానే వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే టీఆరెస్ కూడా ఎపి సమస్యలను పరిగణలోనికి తీసుకుని సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి బృందాన్ని ప్రత్యేకంగా వారిదగ్గరకు పంపారు. టీఆరెస్ కీలక నేత కెకె తో భేటీ అయిన వారు ముఖ్యమంత్రి రాసిన లేఖ పై సానుకూలంగానే స్పందించారు. అయితే లోక్ సభలో నిజంగానే టీఆరెస్ మద్దత్తు అందిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.
కెకె అలా కవిత ఇలా ...
టీఆరెస్ నేతలు కేశవరావు, కవితలు ఇద్దరు రెండురకాలుగా స్పందించి తమ మద్దత్తు ఉంటుందని చెప్పడం పలు సందేహాలు లేవనెత్తుతుంది. విభజన బిల్లు సక్రమంగా లేక తెలంగాణ కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటుందని కెకె ఇప్పటికే చెప్పేశారు. హై కోర్ట్ అంశం తో బాటు అనేక సమస్యలు ఉన్నాయని చట్టంలో సవరణలు ప్రతిపాదించాలని కూడా చెప్పేశారు. ఇక నిజామాబాద్ ఎంపి కేసీఆర్ తనయ కవిత మరో రకంగా స్పందించారు. వైసిపి ఎంపీలు రాజీనామా చేసి వాటిని ఆమోదించుకున్నారని సానుభూతి వ్యక్తం చేయడం విశేషం. టిడిపి చేస్తున్న పోరాటంపై మాత్రం ఆమె విభిన్నంగానే స్పందించారు. తమ పార్టీ గత సెషన్ లో సైతం ఎపి సమస్యలను ప్రశ్నించిందని చెప్పుకొచ్చారు కవిత. అయితే ఇప్పుడు మైలేజ్ కోసం ఢిల్లీ గద్దెపై జరిగే పోరాటంలో ఎంతవరకు టీఆరెస్ ఏపీకి అండగా ఉంటుందన్నది వేచి చూడాలి.
తీర్మానానికి మద్దతు ఇస్తుందా ?
లోక్ సభ స్పీకర్ శ్రీమతి సుమిత్ర మహాజన్ తెలుగు దేశము పార్టీ ఇఛ్చిన అవిశ్వాస తీర్మానాన్ని స్వీకరించఢంతో ఇప్పుడు తెరాస , తెలుగు దేశము పార్టీ కి మద్దతు తెలుపుతుందో లేదో రేపటివరకు వేచి చూడాలి. మోడీ సర్కార్ కి లోపాయికారి సహకారం అందిస్తుందన్న విమర్శలు ఎదుర్కొంటున్న టి సర్కార్ ఈసారి ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరం.
