Tue Feb 03 2026 02:17:25 GMT+0000 (Coordinated Universal Time)
వాట్సాప్ లో ఇక ఆ బాధ తప్పుతుంది

వాట్సాప్ లో ఇక నకిలీ వార్తలకు చెక్ పడనుంది. వాట్సాప్ లో ఇక నుంచి ఒక మెసేజ్ ఐదుగురికి మించి పంపడానికి కుదరదు. తప్పుడు వార్తలు వాట్సాప్ లో విపరీతంగా షేర్ అవుతున్నందున భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు వాట్సాప్ సంస్థ ఈ నిబంధనలు తీసుకువచ్చింది. మేసేజ్, ఫోటోలు, వీడియోలు ఏవైనా ఇక నుంచి ఐదుగురికి మాత్రమే ఫార్వర్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ ఈ వారం నుంచే మొదలైనట్లు వాట్సాప్ బుధవారం ప్రకటించింది. ఈ నూతన ఫీచర్ తో ఫార్వడ్ మెసేజ్ ల బెడద కొంత తగ్గే అవకాశం ఉంది.
Next Story

