Fri Jan 30 2026 19:27:01 GMT+0000 (Coordinated Universal Time)
తనకంటే ఎక్కువ సంపాదిస్తుందని...

తనకంటే భార్యకు ఎక్కువ జీతం వస్తుండటాన్ని తట్టుకోలేకపోయిన ఓ భర్త భార్య మరణానికి కారణమయ్యాడు. విశాఖపట్నం ఎవీపీ కాలనీకి చెందిన పుష్పవాణికి కృష్ణ నగర్ కాలనీకి చెందిన గంగాధర్ తో 2011లో వివాహం జరిగింది. వివాహం తర్వాత అమెరికా వెళ్లి స్థిరపడిన వీరు అక్కడ ఉద్యోగాల్లో చేరారు. అయితే, పుష్పవాణికి రూ.7.80 లక్షలు జీతం కాగా, గంగాధర్ కి 2 లక్షలు మాత్రమే వేతనం వచ్చేది. దీంతో గంగాధర్ కి అసూయ పెరిగిపోయింది. క్రమంగా పుష్పవాణిని వేదించడం మొదలుపెట్టాడు. దీంతో వారిద్దరూ విశాఖకు తిరిగి వచ్చి వేరుగా ఉంటున్నారు. అయితే, వీరి ఇద్దరు కుమారులను బంధువులను పంపించి గంగాధర్ తనవద్దకు తెచ్చుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన పుష్పవాణి ఇంట్లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
Next Story

