Fri Jan 30 2026 08:03:05 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: హైకోర్టును ఆశ్రయించిన వివేకా భార్య
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన భార్య సౌభాగ్యమ్మ హైకోర్టును ఆశ్రయించారు. తన భర్త హత్య కేసులో నిజానిజాలు బయటకు రావాలని ఆమె కోరారు. [more]
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన భార్య సౌభాగ్యమ్మ హైకోర్టును ఆశ్రయించారు. తన భర్త హత్య కేసులో నిజానిజాలు బయటకు రావాలని ఆమె కోరారు. [more]

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన భార్య సౌభాగ్యమ్మ హైకోర్టును ఆశ్రయించారు. తన భర్త హత్య కేసులో నిజానిజాలు బయటకు రావాలని ఆమె కోరారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల విచారణపై తమకు నమ్మకం లేదని, ఇప్పటివరకు జరిగిన విచారణ పారదర్శకంగా జరగడం లేదని, ఏకపక్షంగా పోలీసులు విచారణ జరుపుతున్నారని ఆమె కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తన భర్తది రాజకీయ కోణంలో జరిగిన హత్య అయినందున ఏపీ ప్రభుత్వ అజమాయిషీ లేని థర్డ్ పార్టీ విచారణ జరిపించి అసలు దోషులను బయటకు తీసుకురావాలని ఆమె కోరారు. ఈ కేసులో ఇప్పటికే రెండు పిటీషన్లు దాఖలయ్యాయి. మూడు పిటీషన్లను కలిపి రేపు విచారణ జరిపిస్తామని కోర్టు తెలిపింది.
Next Story