Wed Jan 28 2026 13:18:18 GMT+0000 (Coordinated Universal Time)
ఉప ఎన్నికకు ఇంతమంది మంత్రులా?
తిరుపతి ఉప ఎన్నికలకు ఇంత మంది మంత్రులను మొహరించాల్సిన అవసరం ఏమొచ్చిందని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి ప్రశ్నించారు. తమదే గెలుపు అని ప్రకటించుకున్న వైసీపీ నేతలకు [more]
తిరుపతి ఉప ఎన్నికలకు ఇంత మంది మంత్రులను మొహరించాల్సిన అవసరం ఏమొచ్చిందని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి ప్రశ్నించారు. తమదే గెలుపు అని ప్రకటించుకున్న వైసీపీ నేతలకు [more]

తిరుపతి ఉప ఎన్నికలకు ఇంత మంది మంత్రులను మొహరించాల్సిన అవసరం ఏమొచ్చిందని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి ప్రశ్నించారు. తమదే గెలుపు అని ప్రకటించుకున్న వైసీపీ నేతలకు ఇంత భయమెందుకన్నారు. పది మంది మంత్రులు, ముప్ఫయి మంది ఎమ్మెల్యేలను ఇక్కడకు దింపారంటే గెలుపుపై అనుమానమొచ్చేనని విష్ణువర్థన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తిరుపతి సభలో పవన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మంత్రులు ఎదురు దాడి చేస్తున్నారన్నారు. తిరుపతి ఉప ఎన్నిక కోసం వైసీపీ వంద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని ఆయన ఆరోపించారు.
Next Story