Sat Dec 13 2025 10:13:23 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీపై బీజేపీ నేత జోస్యం ఇదే

వచ్చే నెల 15వ తేదీ తర్వాత టీడీపీ నుంచి వైసీపీలోకి పెద్దయెత్తున్న నేతలు చేరుతున్నారని బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు జోస్యం చెప్పారు. చాలా మంది వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తన వద్ద సమాచారం ఉందని ఆయన తెలిపారు. తాను వ్యక్తిగతంగా కూడా జగన్ ను కలుస్తానని, విశాఖకు జగన్ పాదయాత్ర వచ్చినప్పుడు ఆయన్ను కలుస్తానని చెప్పారు. ఇది తన వ్యక్తిగత విషయమన్నారు విష్ణుకుమార్ రాజు. టీడీపీ రెండునాల్కల ధోరణిని ప్రజలు చూస్తున్నారని, చంద్రబాబు విశ్వసనీయతను కోల్పోయారన్నారు. రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు దీక్ష చేశారని, దీక్ష కోసం 20 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు.పట్టిసీమలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు.
Next Story
