Sun Feb 01 2026 22:53:29 GMT+0000 (Coordinated Universal Time)
మోదీని మా ప్రజలు క్షమించరు

రికార్డు సమయంలో సచివాలయాన్ని, అసెంబ్లీని కట్టుకోగలిగిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక హైకోర్టు కోసం భవనం ఎందుకు కట్టుకోలేకపోతుందని టీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ...హైదరాబాద్ హైకోర్టులో తెలంగాణ ప్రాంతానికి జడ్జీలు తక్కువ సంఖ్యలో ఉన్నారని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నటికీ క్షమించరని, మోదీ ప్రభుత్వం రాగానే ఖమ్మం జిల్లా నుంచి ఏడు మండలాలనే ఆంధ్రప్రదేశ్లో కలిపారని గుర్తుచేశారు. తెలంగాణకు విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.
Next Story

