Fri Dec 05 2025 14:23:28 GMT+0000 (Coordinated Universal Time)
బట్టలు విప్పితేనే నటన నేర్పిస్తా
హైదరాబాద్ నారాయణగూడలో నటన పేరుతో కీచకపర్వానికి తెర తీశాడు ఓ గురువు. సూత్రదార్ అనే పేరుతో యాక్టింగ్ ఇన్ స్టిట్యూట్ నిర్వహిస్తున్న వినయ్ వర్మ అనే వ్యక్తి [more]
హైదరాబాద్ నారాయణగూడలో నటన పేరుతో కీచకపర్వానికి తెర తీశాడు ఓ గురువు. సూత్రదార్ అనే పేరుతో యాక్టింగ్ ఇన్ స్టిట్యూట్ నిర్వహిస్తున్న వినయ్ వర్మ అనే వ్యక్తి [more]

హైదరాబాద్ నారాయణగూడలో నటన పేరుతో కీచకపర్వానికి తెర తీశాడు ఓ గురువు. సూత్రదార్ అనే పేరుతో యాక్టింగ్ ఇన్ స్టిట్యూట్ నిర్వహిస్తున్న వినయ్ వర్మ అనే వ్యక్తి నటన కోసం తనవద్దకు వచ్చిన యువతులను వేధిస్తున్నాడు. తన వద్ద నటన నేర్చుకోవాలంటే బట్టలు విప్పాలని.. బట్టలు విప్పి నేర్చుకుంటేనే నటన బాగా వస్తుందని యువతులపై ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో ఓ యువతి షీ టీమ్స్ కు ఫిర్యాదు చేయగా వినయ్ వర్మపై నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే, తాను 20 ఏళ్లుగా ఇలానే నటన నేర్పిస్తున్నానని.. నటించే వారికి తన దృష్టిలో ఆడా, మగా అనే తేడా ఉండదని, వారిని ఒక మిషన్ గానే చూస్తానని వినయ్ వర్మ చెబుతున్నాడు.
Next Story