Fri Jan 30 2026 15:56:52 GMT+0000 (Coordinated Universal Time)
విజయసాయికి నోటీసులు

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం నోటీసులు జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఆభరణాలు చంద్రబాబు ఇంట్లో ఉన్నాయని, ఆయన ఇంట్లో సోదాలు జరిపితే శ్రీవారి ఆభరణాలు బయటపడతాయని ఇటీవల విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసేవిధంగా విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయంటూ టీటీడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. విజయసాయిరెడ్డితో పాటు ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులకు కూడా టీటీడీ నోటీసులు ఇచ్చింది. తమ నోటీసులకు సరైన వివరణ ఇవ్వకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ ఆ నోటీసులో తెలిపింది.
Next Story
