Sun Mar 22 2026 18:30:42 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు..?

ఎవరిపైనో ఐటీ దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు భయపడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ సహకరించడం వల్లే రాష్ట్ర విభజన జరిగిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీల పొత్తు అనైతికమని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు ఏం న్యాయం చేశారో ద్వారకా తిరుమల వెంకన్న సాక్షిగా చంద్రబాబు ప్రమాణం చేసి చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం కుడికాలువపై 2014కి ముందు వరకు కోర్టుల్లో కేసులు ఎందుకు వేశారో చెప్పాలన్నారు. 2014లోనే పోలవరం పనులు ప్రారంభించి ఉంటే ఇప్పటికే గ్రావిటీ ద్వారా నీరు అందించే అవకాశం ఉండేదన్నారు. 15 సీట్లు టీడీపీకి ఇచ్చిన జిల్లాకు చంద్రబాబు ఏమీ న్యాయం చేయలేదని, తన మనుషులతో ఇసుక దందా చేయిస్తున్నారని ఆరోపించారు.
Next Story

