Fri Mar 20 2026 22:19:43 GMT+0530 (India Standard Time)
నిధుల కంటే నిమ్మగడ్డ గొప్పా….?
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వైఎస్ జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ ను పూర్తి చేయకపోవడం [more]
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వైఎస్ జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ ను పూర్తి చేయకపోవడం [more]

విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వైఎస్ జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ ను పూర్తి చేయకపోవడం పై కేశినేని నాని అసహనం వ్యక్తం చేశారు. బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ నిర్మాణంలో జాప్యం జరగడానికి కారణమేంటని కేశినేని నాని ట్విట్టర్లో ప్రశ్నించారు. చిన్న పనులను చేయడం చేతకాని వారు పెద్ద పనులు ఎలా పూర్తి చేస్తారని కేశినేని నాని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను తీసుకురావడంలో వైఫల్యం చెందారని, నిమ్మగడ్డను ఎలా తీసుకురావడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లుందని కేశినేని నాని సెటైర్ వేశారు.
Next Story