Thu Mar 19 2026 15:19:26 GMT+0530 (India Standard Time)
దుస్తులు మార్చుకునే గదిలో కెమెరాలు

విజయవాడ దుర్గ గుడి వద్ద అధికారులు చేసిన పని తీవ్ర విమర్శలపాలవుతోంది. ఇంద్రకీలాద్రిలోని సీవీ రెడ్డి ఛారిటీస్ లోని మహిళలలు ఉండే గదుల్లో, బట్టలు మార్చుకునే గదుల్లో ఆలయ అధికారులు సీసీ కెమెరాలను అమర్చారు. కెమెరాలు అమర్చి నాలుగు నెలలైనా ఎవరూ గుర్తించలేకపోయారు. అయితే, ఓ పెళ్లి బృందం ఈ కెమెరాలను గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం అధికారులు స్పందించడం లేదు. కెమెరాలకు కనెక్షన్ ఇవ్వలేదని కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు.
Next Story

