Sun Mar 22 2026 04:18:10 GMT+0530 (India Standard Time)
విజయశాంతి సంచలన నిర్ణయం

వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయడం లేదని సినీనటి, తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకే తెలిపానన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. ప్రజలు ఐదేళ్లు అవకాశమిస్తే కేసీఆర్ ముందుగానే ఎన్నికలకు వెళ్లడమేంటని ప్రశ్నించారు. విజయశాంతి తొలిసారి గాంధీ భవన్ కు వచ్చారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. యుద్ధానికి తాము సిద్ధమేనన్నారు. కేసీఆర్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతామని చెప్పారు. పార్టీ నిర్ణయం మేరకే తాను ఎక్కడెక్కడ ప్రచారం చేయాల్సిందనేది ఉంటుందన్నారు.
Next Story

