Mon Mar 23 2026 17:52:22 GMT+0530 (India Standard Time)
విజయసాయి కూడా పాదయాత్ర

విశాఖ జిల్లాపై పట్టు సాధించేందుకు వైసీపీ అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందులో భాగంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విశాఖ నగరంలో పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. వైఎస్ జగన్ పాదయాత్రకు సంఘీభావంగా ఈ యాత్ర ఉంటుందని చెప్పారు. మే 2వ తేదీ నుంచి పదిరోజుల పాటు విశాఖ నగర కార్పొరేషన్ పరిధిలోని 72 వార్డుల్లో విజయసాయి రెడ్డి పాదయాత్ర చేస్తారు. మొత్తం 180 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర ఉంటుందని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. విశాఖ జిల్లాలో ఈ నెల 30వ తేదీ వైసీపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ వంచన దీక్ష చేస్తోంది.
Next Story

