Tue Mar 17 2026 03:45:20 GMT+0530 (India Standard Time)
స్వయంకృతాపరాధం అంటే ఇదే మరి..!

తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలో దిగి ఉంటే కాంగ్రెస్ ఓడిపోయినా కనీసంగా సానుభూతి అయినా మిగిలేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఎక్కడా దిక్కు లేక చంద్రబాబు డబ్బు మూటలతో వస్తే ఆయనకు పెత్తనం అప్పగించి కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంటోందని, స్వయంకృతాపరాధం అంటే ఇదేనన్నారు. చంద్రబాబు ఒక కలుపుమొక్క అని, తెలంగాణ ప్రజలు ఇచ్చే తీర్పుతో ఈ కలుపుమొక్క రాజకీయం ముగిసినట్లేనని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పెట్టిన ప్రతి రూపాయి ఏపీలో బాబు చేసిన దోపిడీ సొమ్మే అని ప్రజలకు అర్థం అయ్యిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.
Next Story

