Mon Mar 23 2026 16:58:51 GMT+0530 (India Standard Time)
కాపీ కొట్టి ఐపీఎస్ పాసయ్యాడేమో..?

జగన్ పై జరిగిన హత్యాయాత్నం గురించి డీజీపీ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ ముఖ్యనేత విజయసాయి రెడ్డి ఖండించారు. డీజీపీ కనీస విచారణ కూడా జరగకముందే దాడి చేసింది వైసీపీ వ్యక్తి అని చెప్పడం, పబ్లిసిటీ కోసం చేశాడని చెప్పడం బాధాకరణమన్నారు. విచారణ పూర్తికాక ముందే ఇష్టం వచ్చినట్లు స్టేట్ మెంట్లు ఇచ్చి డీజీపీ టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. డీజీపీ వైఖరి చూస్తుంటే కాపీ కొట్టి ఐపీఎస్ పాస్ అయినట్లుగా ఉందని విమర్శించారు. భగవంతుడి దయ ఉంది కాబట్టే జగన్ బయటపడ్డారని పేర్కొన్నారు. జగన్ సహజంగానే ధైర్యవంతుడని, ఇటువంటి చర్యలతో ఆయనను భయపెట్టలేరని వ్యాఖ్యానించారు.
Next Story

