Thu Mar 19 2026 04:09:26 GMT+0530 (India Standard Time)
విజయసాయి పుస్తకంపై ఆసక్తి...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఓ పుస్తకం రాశారు. తిరుమల శ్రీవారిపైన ఆయన ఈ పుస్తకం తెస్తున్నారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానముల బోర్డు సభ్యుడిగా పనిచేసిన విజయసాయిరెడ్డి స్వామివారికి భక్తుడు. వెంకటేశ్వర స్వామి వైభవం, మహత్యం, పూజలు, వంటి అనేక విషయాలను ఆయన పుస్తకంలో రాశారు. ‘గ్లోరీ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర’ పేరుతో పుస్తకం రాసినట్లు స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించారు. త్వరలోనే తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, గుజరాతీల్లోనూ పుస్తకాన్ని ఒకేసారి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, రాష్ట్రంతో పాటు ఢిల్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ తరుపున క్రియాశీలకంగా రాజకీయాల్లో పనిచేసే విజయసాయిరెడ్డి పుస్తకం రాయడం, అదీ భక్తి పుస్తకం రాయడం గమనార్హం.
Next Story

