Sun Mar 15 2026 09:22:19 GMT+0530 (India Standard Time)
షర్మిల, జగన్ ల మధ్య విభేదాలు లేవు
వైఎస్ వివేకానందరెడ్డ హత్య కేసులో నిందితులు ఎవరో నిగ్గు తేల్చాల్సిందేనని విజయమ్మ కోరారు. ఈ మేరకు విజయమ్మ ఐదు పేజీల బహిరంగ లేఖను విడుదల చేశారు. ఇది తన మాట, జగన్, షర్మిల మాటగా విజయమ్మ చెప్పుకొచ్చారు.

వైఎస్ వివేకానందరెడ్డ హత్య కేసులో నిందితులు ఎవరో నిగ్గు తేల్చాల్సిందేనని విజయమ్మ కోరారు. ఈ మేరకు విజయమ్మ ఐదు పేజీల బహిరంగ లేఖను విడుదల చేశారు. ఇది తన మాట, జగన్, షర్మిల మాటగా విజయమ్మ చెప్పుకొచ్చారు. ఇందులో తమ కుటుంబానికి రెండో అభిప్రాయం లేదని విజయమ్మ తన లేఖలో కోరారు. సీబీఐ దర్యాప్తు సంస్థ కేంద్ర పరిధిలో ఉందని తెలిసి కూడా పవన్ కల్యాణ్ లాంటి వారు తమపై ఆరోపణలు చేస్తున్నారని విజయమ్య లేఖలో పేర్కొన్నారు. జగన్, షర్మిల మధ్య విబేధాలు తీసుకురావాలని చాాలా మంది ప్రయత్నిస్తున్నారన్నారు. కానీ వారి మధ్య వేర్వేరు అభిప్రాయాలేతప్ప తప్ప విభేదాలు లేవని విజయమ్మ చెప్పారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఆదినారాయణ రెడ్డి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. సునీత డిమాండ్ కు తమ అందరి మద్దతు ఉందని విజయమ్మ చెప్పారు.
Next Story

