Sun Mar 15 2026 19:46:18 GMT+0530 (India Standard Time)
జగన్ శిబిరానికి విజయమ్మ, భారతి

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పాదయాత్ర శిబిరం వద్ద పార్టీ శ్రేణులు, నాయకుల నడుమ జగన్ కేక్ కట్ చేశారు. అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు పుట్టినరోజు వేడుకలు జరిపారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం వద్ద కూడా నేతలు వేడుకలు జరిపారు. జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తల్లి వై.ఎస్.విజయమ్మ, భార్య వై.ఎస్.భారతి జగన్ వద్దకు వెళ్లారు. ఇవాళ ఆయన పాదయాత్ర జరుగుతున్న టెక్కలి నియోజకవర్గం రావివలస వద్ద జగన్ శిబిరం వద్దకు వారు చేరుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి జగన్ పుట్టినరోజు వేడుకలను జరుపుకోనున్నారు.
Next Story

