Sat Dec 06 2025 00:08:44 GMT+0000 (Coordinated Universal Time)
నైట్ కర్ఫ్యూ అంటూ ఈ నాటకాలేంటి?
నైట్ కర్ఫ్యూ అంటూ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని బీజేపీ నేత విజయశాంతి ఆరోపించారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న పబ్బులు, బార్ లు, [more]
నైట్ కర్ఫ్యూ అంటూ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని బీజేపీ నేత విజయశాంతి ఆరోపించారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న పబ్బులు, బార్ లు, [more]

నైట్ కర్ఫ్యూ అంటూ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని బీజేపీ నేత విజయశాంతి ఆరోపించారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న పబ్బులు, బార్ లు, మద్యం దుకాణాలకు అనుమతిచ్చిన ప్రభుత్వం ఇప్పుడు నైట్ కర్ఫ్యూ అంటూ నాటకాలాడుతుందన్నారు. బహిరంగ సభలకు, ర్యాలీలకు ఎలా అనుమతిచ్చారంటూ విజయశాంతి ఫైర్ అయ్యారు. రాత్రి కర్ఫ్యూ పెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని, పగటి పూట ఎలాంటి నియంత్రణ చర్యలు లేవని విజయశాంతి దుయ్యబట్టారు.
Next Story