Thu Jan 29 2026 12:20:21 GMT+0000 (Coordinated Universal Time)
తేడా తెలియని లోకేశా… అజ్ఞానాన్ని వీడవోయి
వైసీపీ ఎంపీ విజయసాయరెడ్డి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ చేస్తున్న ప్రచారాలను ఆయన ఖండించారు. లోకేశ్ కు నేచురల్ [more]
వైసీపీ ఎంపీ విజయసాయరెడ్డి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ చేస్తున్న ప్రచారాలను ఆయన ఖండించారు. లోకేశ్ కు నేచురల్ [more]

వైసీపీ ఎంపీ విజయసాయరెడ్డి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ చేస్తున్న ప్రచారాలను ఆయన ఖండించారు. లోకేశ్ కు నేచురల్ గ్యాస్ కు, ఎల్పీజీకి మధ్య ఉన్న తేడా తెలియదని ఎద్దేవా చేశారు. నేచురల్ గ్యాస్ పై వ్యాట్ పెంచితే ఎల్పీజీ పెంచినట్లు ప్రచారం చేయడం లోకేష్ అవగాహనరాహిత్యానికి నిదర్శనమన్నారు విజయసాయిరెడ్డి. ఇంత అజ్ఞానంతో వ్యవహరిస్తూ బిల్డప్ దేనికంటూ ట్వీట్ చేశారు. చంద్రబాబు దళిత రాజకీయాలు మానుకోవాలని, వైఎస్సార్ ఆసరా పథకాన్ని దృష్టి మరల్చేందుకే దళితులపై దాడి అంటూ చంద్రబాబు కొత్త నినాదాన్ని అందుకున్నారని విజయసాయరెడ్డి విమర్శించారు.
Next Story