Sun Mar 22 2026 01:41:27 GMT+0530 (India Standard Time)
బాబూ కపట నాటకాలు ఆపు
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై మండి పడ్డారు. బీసీల పట్ల చంద్రబాబు కపట ప్రేమను ఒలకబోస్తున్నారన్నారు. జగన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో [more]
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై మండి పడ్డారు. బీసీల పట్ల చంద్రబాబు కపట ప్రేమను ఒలకబోస్తున్నారన్నారు. జగన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో [more]

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై మండి పడ్డారు. బీసీల పట్ల చంద్రబాబు కపట ప్రేమను ఒలకబోస్తున్నారన్నారు. జగన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 9. 85 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని భావిస్తే, చంద్రబాబు తన మనుషులతో కోర్టులో కేసులు వేయించి అడ్డుకున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఆయన ట్విట్టర్లో ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ఎక్కడ లేని ప్రేమ బీసీలపై పుట్టుకొచ్చిందని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. బీసీలను ఇంతకాలం అణగదొక్కింది చంద్రబాబు అని విజయసాయిరెడ్డి ఆరోపించారు.
Next Story