Thu Jan 29 2026 15:27:53 GMT+0000 (Coordinated Universal Time)
ఎగిరెగిరి పడుతుంటే ఏందో అనుకున్నాం
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబు పై విమర్శలు చేశారు. ఆయన ట్విట్టర్ లో చంద్రబాబుతో పాటు ఎల్లోమీడియాను కూడా విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ కోసం రాజీలేని [more]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబు పై విమర్శలు చేశారు. ఆయన ట్విట్టర్ లో చంద్రబాబుతో పాటు ఎల్లోమీడియాను కూడా విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ కోసం రాజీలేని [more]

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబు పై విమర్శలు చేశారు. ఆయన ట్విట్టర్ లో చంద్రబాబుతో పాటు ఎల్లోమీడియాను కూడా విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ కోసం రాజీలేని పోరు చేస్తానని చంద్రబాబు ఎగిరెగిరి పడుతుంటే అందరూ నిజమేననుకున్నారని, కానీ పార్క్ హయత్ హోటల్ సాక్షిగా దొరికిపోతానని అనుకోలేదని విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. వెన్నుపోట్లతో, కుట్రలతో ఏదైనా చేయవచ్చని చంద్రబాబు ఉద్దేశ్యమన్నారు. పార్క్ హయత్ హోటల్ అంశాన్ని ఎల్లోమీడియా తొక్కిపెట్టే ప్రయత్నం చేసిందన్నారు. కానీ సోషల్ మీడియా కారణంగా ప్రజలందరూ ఈ కుట్రను తెలుసుకోగలిగారని విజయసాయిరెడ్డి చెప్పారు.
Next Story