Mon Dec 08 2025 14:01:54 GMT+0000 (Coordinated Universal Time)
నన్ను జగన్ కారులో నుంచి దించలేదు.. నేనే దిగిపోయా
విశాఖ పర్యటనకు జగన్ వెంట తాను రాలేక పోవడానికి కారణం హెలికాప్టర్ లో ప్లేస్ లేకపోవడమేనని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. తనను జగన్ కారు నుంచి [more]
విశాఖ పర్యటనకు జగన్ వెంట తాను రాలేక పోవడానికి కారణం హెలికాప్టర్ లో ప్లేస్ లేకపోవడమేనని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. తనను జగన్ కారు నుంచి [more]

విశాఖ పర్యటనకు జగన్ వెంట తాను రాలేక పోవడానికి కారణం హెలికాప్టర్ లో ప్లేస్ లేకపోవడమేనని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. తనను జగన్ కారు నుంచి దించివేశారన్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. హెలికాప్టర్ లో ప్లేస్ ఒకరికే ఉందని, ఆరోగ్యశాఖ మంత్రి అక్కడకు వెళ్లాల్సి ఉండటంతో తాను స్వచ్ఛందంగానే దిగిపోయానని విజయసాయిరెడ్డి వివరించారు. ఈ ఘటనను కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశాయన్నారు. తనంతట తానుగానే కారు దిగిపోయానని విజయసాయిరెడ్డి చెప్పారు.
Next Story