Wed Jan 28 2026 13:21:24 GMT+0000 (Coordinated Universal Time)
కర్ణాటక ప్రమాద ఘటనలో మృతులంతా తెలుగువారే?
కర్ణాటకలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారు హైదరాబాద్ వారేనని చెబుతున్నారు.

కర్ణాటకలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారు హైదరాబాద్ వారేనని చెబుతున్నారు. ఈసీఐఎల్ కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అర్జున్ తన పుట్టిన రోజు వేడుకలను గోవాలో జరుపుకునేందుకు నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులను 29 మందితో కలసి ప్రయివేటు బస్సులో గోవా వెళ్లినట్లు చెబుతున్నారు. గోవాలో నాలుగు రోజులు ఉండి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ బస్సులో మొత్తం నాలుగు కుటుంబాలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం.
పుట్టినరోజు వేడుకలు....
బస్సు ప్రమాద ఘటనలో ఎనిమిది మంది సజీవ దహనం అయ్యారు. తెల్లవారు జామున జరగడంతో అందరూ నిద్రలోనే ఉన్నారు. దీంతో ఎంత మంది బస్సు నుంచి బయటపడ్డారన్నది ఇంకా తెలియరాలేదు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. కర్ణాటకలోని కలబురిగి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో ఎంతమంది వృద్ధులు,చిన్నారులు ఉన్నారనేది తెలియాల్సి ఉంది.
Next Story

