Mon Dec 08 2025 19:09:30 GMT+0000 (Coordinated Universal Time)
వెంకయ్య అసహనం
భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొందరు రాజకీయ నేతల పట్ల అసహనం వ్యక్తం చేశారు. విశాఖకు వచ్చిన వెంకయ్య నాయుడు మాట్లాడుతూ నేటి తరం నాయకులు భాషను [more]
భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొందరు రాజకీయ నేతల పట్ల అసహనం వ్యక్తం చేశారు. విశాఖకు వచ్చిన వెంకయ్య నాయుడు మాట్లాడుతూ నేటి తరం నాయకులు భాషను [more]

భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొందరు రాజకీయ నేతల పట్ల అసహనం వ్యక్తం చేశారు. విశాఖకు వచ్చిన వెంకయ్య నాయుడు మాట్లాడుతూ నేటి తరం నాయకులు భాషను అదుపులో పెట్టుకోవాలన్నారు. పార్లమెంటులో నిన్న చోటు చేసుకున్న ఘటన దురదృష్టకరమని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో అసభ్య పదజాలంతో దూషించుకోవడం నేటి తరం నేతలకు ఫ్యాషన్ గా మారిందన్నారు. ఇతర పార్టీల నేతలు శత్రువులు కాదని, రాజకీయంగానే ప్రత్యర్థులన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అన్ని రాష్ట్రాల శాసనసభలో ఇదే తంతు జరుగుతుందని వెంకయ్యనాయుడు అసహనం వ్యక్తం చేశారు.
Next Story