Mon Mar 23 2026 10:27:53 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు వైఖరి భేష్

తెలంగాణలో కూటమి ఏర్పాటు ముఖ్యమని, అవసరమైతే సీట్ల త్యాగాలకు సిద్ధమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనపై కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ లాగానే తెలంగాణ జన సమితి, సీపీఐ కూడా సీట్ల పంపకంలో సానుకూలంగా వ్యవహరించాలని ఆయన కోరారు. రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఇక పార్టీ అధిష్ఠానం బీసీలకు సీట్ల కేటాయింపుపై చర్చించేందుకు తనను పిలవలేదని, తనకంటే పెద్ద బీసీ నాయకుడు పార్టీలో ఎవరు ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రబాబును ఎంత తిట్టినా ఆయన మాత్రం ఒక్క మాట కూడా అనకపోవడం గొప్పదనమన్నారు.
Next Story

