Mon Dec 15 2025 08:58:56 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్నికల బరిలో వేణుమాధవ్

హాస్య నటుడు వేణుమాధవ్ తెలంగాణ ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఆయన టీడీపీలో పనిచేసినా ఇప్పుడు మాత్రం స్వతంత్రంగా పోటీ చేయాలని అనుకుంటున్నారు. స్వంత నియోజకవర్గం కోదాడ నుంచి ఆయన నామినేషన్ వేయనున్నారు. వేణుమాధవ్ స్వస్థలం కోదాడ పట్టణమే కావడంతో ఇక్కడి నుంచే పోటీ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే, వేణుమాధవ్ మొదటి నుంచి టీడీపీకి అనుకూలంగా పనిచేశారు. అనేక ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం నిర్వహించారు. మరి, ఆ పార్టీ టిక్కెట్ అడగలేదో లేదా ఇవ్వనన్నారో తెలియదు గానీ ఆయన ఇండిపెండెంట్ గా బరిలో ఉండాలనుకుంటున్నారు.
Next Story

