వెంకయ్య అలా చేశారేంటి ...?

కాంగ్రెస్ సహా ఏడు పార్టీలు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్ర పై అభిశంసన నోటీస్ ఇచ్చాయి. రాజ్యసభలో దీపక్ మిశ్రాపై చర్చను కోరుతూ 64 మంది ఎంపీల సంతకాలతో పెద్దల సభ ఛైర్మన్ గా వున్న ఉపరాష్ట్రపతికి ఈ నోటీస్ అందజేశాయి. ఈ నోటీస్ అందుకున్న వెనకయ్య నాయుడు మూడు రోజుల పాటు న్యాయనిపుణులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మాజీ సుప్రీం న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి, అటార్నీజనరల్, న్యాయశాఖ కార్యదర్శి వంటి నిపుణులతో అభిశంసన అనుమతించాలా? తిరస్కరించాలా ? అన్న అంశం పై లోతుగా పరిశీలించారు. మెజారిటీ న్యాయనిపుణుల అభిప్రాయం మేరకు తిరస్కరించడానికి నిర్ణయం తీసుకుని ఆ పని పూర్తి చేశారు.
భగ్గుమన్న కాంగ్రెస్ ...
ఉపరాష్ట్రపతి తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ ఇతర విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సుప్రీం ప్రధాన న్యాయమూర్తిని చేతిలో పెట్టుకుని ప్రధాని మోడీ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని కాంగ్రస్ ఆరోపించింది. తక్షణం ఈ అంశంపై చర్చ జరిగి తీరాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ఉపరాష్ట్రపతి తిరస్కరించినా ఈ అంశాన్ని విడిచిపెట్టేది లేదని అంటుంది. దీనిపై సుప్రీం కోర్టు కి వెళ్లే యోచనలో కాంగ్రెస్ ఇతర పక్షాలు అడుగులు వేస్తున్నాయి.
