Sun Feb 01 2026 17:04:02 GMT+0000 (Coordinated Universal Time)
చినబాబుపై వెంకయ్య ప్రశంసలు

తమిళ నటుడు కార్తీ హీరో గా తెరకెక్కిన చినబాబు సినిమాపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘వ్యవసాయ ప్రాధాన్యత, కుటుంబ జీవనము, పశుసంపద పట్ల ప్రేమ, ఆడపిల్లల పట్ల నెలకొన్న వివక్ష నేపథ్యంలో ‘చినబాబు’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ప్రజాదరణ పొందే విధంగా రూపొందించిన దర్శకుడు పాండిరాజ్, నిర్మాత సూర్య, నటుడు కార్తికి అభినందనలు’’, ‘‘ఇటీవల కాలంలో నేను చూసిన మంచి సినిమా ‘చినబాబు’ అశ్లీలత, జుగుప్సా మచ్చుకైనా లేకుండా రూపొందిన చిత్రం. గ్రామీణ వాతావరణం, పద్ధతులు, సంప్రదాయాలు, పచ్చని పొలాలతో ఆహ్లాదభరితంగా రూపొందిన ‘చినబాబు’ సకుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం.’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

ఉప రాష్ట్రపతే తమ సినిమాను మెచ్చుకోవడం పట్ల చిత్ర బృందం సంతోషంలో మునిగిపోయారు. వెంకయ్యకు కృతజ్ఞతలు తెలుపుతూ నిర్మాత సూర్య, హీరో కార్తి ట్వీట్ చేశారు.
Next Story

