Tue Mar 17 2026 08:25:27 GMT+0530 (India Standard Time)
ఆలయాల వద్దకు వస్తే అంతే… బాబుకు వెల్లంపల్లి వార్నింగ్
దేవాలయాల వద్ద నిరసనలు తెలిపితే కఠిన చర్యలు తప్పవని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏడు రోజుల పాటు ఏడు ఆలయాల్లో నిరసనలు [more]
దేవాలయాల వద్ద నిరసనలు తెలిపితే కఠిన చర్యలు తప్పవని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏడు రోజుల పాటు ఏడు ఆలయాల్లో నిరసనలు [more]

దేవాలయాల వద్ద నిరసనలు తెలిపితే కఠిన చర్యలు తప్పవని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏడు రోజుల పాటు ఏడు ఆలయాల్లో నిరసనలు తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆలయాల వద్ద శాంతిభద్రతలకు భంగం కల్గించినా, పార్టీ జెండాలు కన్పించినా చర్యలు తప్పవని అన్నారు. చంద్రబాబు ఎన్ని గుళ్లు తిరిగినా చేసిన పాపాలు పోవని వెల్లంపల్లి శ్రీనివాస్ శాసనార్థాలు పెట్టారు. చంద్రబాబు పుష్కరాల సందర్భంగా నలభైకి పైగా ఆలయాలను ధ్వంసం చేశారన్నారు.చంద్రబాబు ఆలయాలను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు.
Next Story