Wed Jan 21 2026 02:01:10 GMT+0000 (Coordinated Universal Time)
దేవినేని ఉమ వల్లనే ఘర్షణకు కారణం
మైలవరంలో దేవినేని ఉమ వల్లనే ఘర్షణ వాతావరణం నెలకొందని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మైలవరంలోనే ఎందుకు జరుగుతుందని [more]
మైలవరంలో దేవినేని ఉమ వల్లనే ఘర్షణ వాతావరణం నెలకొందని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మైలవరంలోనే ఎందుకు జరుగుతుందని [more]

మైలవరంలో దేవినేని ఉమ వల్లనే ఘర్షణ వాతావరణం నెలకొందని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మైలవరంలోనే ఎందుకు జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ఉమ హయాంలోనే కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరిగిందని వసంత కృష్ణ ప్రసాద్ ఆరోపించారు. దేవినేని ఉమ చెప్పేదంతా అబద్ధమని ఆయన అన్నారు. తమ నేతలపైనే దాడులు చేశారని, ఎల్లో మీడియా ఏకపక్షంగా వ్యవహరిస్తుందని వసంత కృష్ణ ప్రసాద్ ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో బలం కోల్పోయి నియోజకవర్గాల్లో అలజడి సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.
Next Story