Wed Jan 21 2026 03:30:02 GMT+0000 (Coordinated Universal Time)
వసంత వైలెంట్ కామెంట్స్
జగన్ బలవంతుడని, ఆయన నిర్ణయమే ఫైనల్ అవుతుందని మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. జగన్ నిర్ణయాన్ని తాను వ్యతిరేకించలేనని చెప్పారు. కానీ ఈ ప్రాంత [more]
జగన్ బలవంతుడని, ఆయన నిర్ణయమే ఫైనల్ అవుతుందని మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. జగన్ నిర్ణయాన్ని తాను వ్యతిరేకించలేనని చెప్పారు. కానీ ఈ ప్రాంత [more]

జగన్ బలవంతుడని, ఆయన నిర్ణయమే ఫైనల్ అవుతుందని మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. జగన్ నిర్ణయాన్ని తాను వ్యతిరేకించలేనని చెప్పారు. కానీ ఈ ప్రాంత వాసిగా తాను రాజధాని అమరావతిలోనే ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. అయితే జగన్ నిర్ణయం తనకు శిరోధార్యమన్నారు. రాజధానిని అమరావతి నుంచి తొలగించడం లేదని జగన్ చెప్పడం లేదని, మూడు రాజధానులు ఉంటాయని చెబుతున్నారన్నారు. జగన్ నిర్ణయాన్ని కాదనలేనని, కానీ తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రం రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని ఆయన చెప్పారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలని వసంత కృష్ణప్రసాద్ నిర్వేదం వ్యక్తం చేశారు.
Next Story