Mon Mar 23 2026 11:05:53 GMT+0530 (India Standard Time)
వైసీపీలో చేరుతున్నా...ఫిక్స్ అంతే..!

వైసీపీలో తాను చేరుతున్నానని, తనతో టీడీపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరావు కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్ ఈరోజు చెప్పారు. తాను త్వరలోనే జగన్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే ఎప్పడనేది తాను త్వరలోనే చెబుతానని, జగన్ కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్నప్పుడే తన చేరిక ఉంటుందని వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. తెలుగుదేశం పార్టీని వీడటం ఖాయమని ఆయన సోమవారం మీడియాకు తేల్చిచెప్పారు.
Next Story

