Tue Feb 03 2026 14:28:39 GMT+0000 (Coordinated Universal Time)
పెద్దిరెడ్డిపై ప్రత్యేక నిఘా పెట్టాలి
తిరుపతి నియోజకవర్గం ఉప ఎన్నికలలో అధికార వైసీపీ అరాచకాలకు పాల్పడుతుందని టీడీపీ నేత వర్లరామయ్య అన్నారు. తాము కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినా ఫలితం [more]
తిరుపతి నియోజకవర్గం ఉప ఎన్నికలలో అధికార వైసీపీ అరాచకాలకు పాల్పడుతుందని టీడీపీ నేత వర్లరామయ్య అన్నారు. తాము కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినా ఫలితం [more]

తిరుపతి నియోజకవర్గం ఉప ఎన్నికలలో అధికార వైసీపీ అరాచకాలకు పాల్పడుతుందని టీడీపీ నేత వర్లరామయ్య అన్నారు. తాము కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. బయట వ్యక్తులు హోటళ్లు, కల్యాణ మండపాల్లో ఇతర ప్రాంతాల వారు పెద్దయెత్తున ఉన్నారన్నారు. అంబులెన్స్ లలో డబ్బును పంపిణీ చేస్తున్నారని తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వర్ల రామయ్య ఆరోపించారు. పెద్దిరెడ్డిపై ప్రత్యేక నిఘా పెట్టాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ సూచనలను ఇక్కడి అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
Next Story