Thu Mar 19 2026 21:27:20 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వరవరరావు ఇంట్లో మహారాష్ట్ర పోలీసులు...?

విరసం నేత వరవరరావు ఇంట్లో మహారాష్ట్ర పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఈరోజు ఉదయం మహారాష్ట్ర నుంచి వచ్చిన పోలీసులు గాంధీనగర్ లోని వరవరరావు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారన్న కేసులో వరవరరావు ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మోదీ హత్యకు మావోయిస్టులు కుట్రపన్నారంటూ కొన్నాళ్ల క్రితం పూనే పోలీసులు బయటపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ కుట్రకు నిధుల సమీకరణ చేసింది వరవరరావేనన్నది పోలీసుల అనుమానం. వరవరరావు ఇంటితో పాటు మరో జర్నలిస్టు ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
Next Story

