Sun Mar 16 2025 07:34:15 GMT+0000 (Coordinated Universal Time)
వంశీ పోలీస్ కంప్లయింట్
వల్లభనేని వంశీ తనపై అసభ్యకరమైన పోస్టులు సోషల్ మీడియాలో పెట్టినందుకు పోలీసుల ఫిర్యాదు చేశారు. వల్లభనేని అరుణ పేరిట ట్రస్ట్ పేరుతో తాను సేవ చేస్తున్నా తన [more]
వల్లభనేని వంశీ తనపై అసభ్యకరమైన పోస్టులు సోషల్ మీడియాలో పెట్టినందుకు పోలీసుల ఫిర్యాదు చేశారు. వల్లభనేని అరుణ పేరిట ట్రస్ట్ పేరుతో తాను సేవ చేస్తున్నా తన [more]

వల్లభనేని వంశీ తనపై అసభ్యకరమైన పోస్టులు సోషల్ మీడియాలో పెట్టినందుకు పోలీసుల ఫిర్యాదు చేశారు. వల్లభనేని అరుణ పేరిట ట్రస్ట్ పేరుతో తాను సేవ చేస్తున్నా తన కుటుంబంపై సోషల్ మీడియా ద్వారా బురద జల్లుతున్నారని వల్లభనేని వంశీ ఆరోపిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే వల్లభనేని వంశీ పోలీసు కమిషనర్ తిరుమలరావును కలిశారు. తెలుగుదేశం పార్టీ నేతలు కొందరు తమపై కావాలని దుష్రచారం చేస్తున్నారు. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి మరీ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్నారని వంశీ ఆరోపిస్తున్నారు. తనపై కొన్ని వెబ్ సైట్ల ద్వారా నారా లోకేష్ దుష్ప్రచారం చేస్తున్నారని వల్లభనేని వంశీ నిన్ననే ఆరోపించిన సంగతి తెలిసిందే.
Next Story