Thu Mar 19 2026 21:31:23 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : అరగంట సేపు జగన్ తో వంశీ
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. దాదాపు అరగంట సేపు వీరి భేటీ జరిగింది. దీంతో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని [more]
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. దాదాపు అరగంట సేపు వీరి భేటీ జరిగింది. దీంతో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని [more]

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. దాదాపు అరగంట సేపు వీరి భేటీ జరిగింది. దీంతో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీని వీడతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల వల్లభనేని వంశీ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని కలిశారు. ఈరోజు ఉదయం బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని కలిశారు. తాజాగా జగన్ ను కూడా కలవడంతో గన్నవరం టీడీపీ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. తనపై నమోదయిన కేసుల నుంచి తప్పించుకునేందుకు, ఆ కేసుల వివరాలను జగన్ కు వివరించేందుకే వల్లభనేని వంశీ కలిశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వల్లభనేని వంశీ పార్టీని వీడే ప్రసక్తి ఉండదంటున్నారు.
Next Story