వాజూబాయి వార్నింగ్
కర్ణాటక శాసనసభలో బలపరీక్షకు ఈరోజు మధ్యాహ్నం 1.30గంటల వరకూ గవర్నర్ వాజూబాయి వాలా సమయం ఇచ్చారు. మధ్యాహ్నం 1.30గంటలోగా బలాన్ని నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి కుమారస్వామికి గవర్నర్ వాజూబాయి [more]
కర్ణాటక శాసనసభలో బలపరీక్షకు ఈరోజు మధ్యాహ్నం 1.30గంటల వరకూ గవర్నర్ వాజూబాయి వాలా సమయం ఇచ్చారు. మధ్యాహ్నం 1.30గంటలోగా బలాన్ని నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి కుమారస్వామికి గవర్నర్ వాజూబాయి [more]

కర్ణాటక శాసనసభలో బలపరీక్షకు ఈరోజు మధ్యాహ్నం 1.30గంటల వరకూ గవర్నర్ వాజూబాయి వాలా సమయం ఇచ్చారు. మధ్యాహ్నం 1.30గంటలోగా బలాన్ని నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి కుమారస్వామికి గవర్నర్ వాజూబాయి వాలా లేఖ రాశారు. నిన్ననే విశ్వాస పరీక్ష జరపాలని స్పీకర్ కు గవర్నర్ లేఖ రాసినా పట్టించుకోక పోవడంపై వాజుబాయివాలా ఆగ్రహంగా ఉన్నారు. మధ్యాహ్నంలోపు విశ్వాస పరీక్ష కర్ణాటక శాసనసభలో జరగకుంటే రాష్ట్రపతి పాలన విధించే యోచనలో కూడా గవర్నర్ ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు గవర్నర్ ఇప్పటికే కేంద్ర హోంశాఖకు కర్ణాటకలో రాజకీయ సంక్షోభం నెలకొందని లేఖ రాశారాని తెలుస్తోంది. మొత్తం మీద ఈరోజు శాసనసభలో కుమారస్వామి విశ్వాసపరీక్షను ఎదుర్కొనకుంటే గవర్నర్ తన అధికారాన్ని ఉపయోగించి రాష్ట్రపతి పాలనను విధిస్తారన్న ప్రచారం కన్నడ నాట జోరుగా సాగుతోంది