Thu Mar 19 2026 06:00:58 GMT+0530 (India Standard Time)
అటల్ జీ ఆరోగ్యం మరింత విషమం...?

మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయ ఆరోగ్యం మరింత విషమించినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ అధికారిక కార్యక్రమాలను వాయిదా వేసుకుంది. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను జూన్ 12వ తేదీన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచు ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. మూత్ర పిండాల సంబంధ వ్యాధితో ఆయన తీవ్రంగా బాధపడుతున్నారు. ఈ రోజు ఆయన పరిస్థితి మరింత క్షిణించింది. దీంతో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎయిమ్స్ కి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
Next Story

