Thu Mar 19 2026 13:52:13 GMT+0530 (India Standard Time)
తెలంగాణకు వాజ్ పేయి అస్థికలు

దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి అస్థికలు తెలంగాణకు తీసుకువస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ తెలిపారు. ఎయిర్ పోర్టు నుంచి పార్టీ కార్యాలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రేపు ఉదయం పార్టీ కార్యాలయంలో ప్రజల దర్శనార్ధం ఉంచుతామని తెలిపారు. అనంతరం బీజేపీ నేతలు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి బాసర వద్ద గోదావరి నదిలో వాజ్ పేయి అస్థికలను కలపుతారని, పవిత్ర గంగా నదిలో మురళీధర్ రావు, తాను కలపనున్నట్లు తెలిపారు.
Next Story

