Thu Mar 19 2026 19:55:57 GMT+0530 (India Standard Time)
వాజ్ పేయి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్

మాజీ ప్రధాని వాజ్ పేయి ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆయన కొద్దిరోజులుగా ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. వాజ్ పేయి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలోని బృందం చికిత్స అందిస్తుంది. తాజాగా ఎయిమ్స్ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో వాజ్ పేయి ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఆయన క్రమంగా కోలుకుంటున్నారని పేర్కొంది. దీంతో వాజ్ పేయి అభిమానులు సంతోషంలో ఉన్నారు. వాజ్ పేయి ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Next Story

