Sat Mar 21 2026 12:28:20 GMT+0530 (India Standard Time)
వీహెచ్ పనికిరారనా?

తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావుకు చేదు అనుభవం ఎదురయింది. సీనియర్ నేతగా తనకు తగిన గౌరవం లభిస్తుందన్న ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం షాకిచ్చింది. నిన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పదవులను భర్తీ చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుకు ప్రణాళిక కమిటీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. దీనిపై వీహెచ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనను గాంధీభవన్ లోనే కూర్చోబెట్టాలన్న అధిష్టానం నిర్ణయాన్ని తప్పుపట్టారు వీహెచ్. తాను రాష్ట్రమంతటా పర్యటించాలని భావిస్తే ప్రణాళిక కమిటీ ఛైర్మన్ ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. తనకు ఈ పదవి అక్కరలేదని చెప్పేశారు. తన నిరసనను అధిష్టానానికి లేఖ ద్వారా తెలియజేస్తానని వీహెచ్ చెబుతున్నారు.
Next Story

