Sat Mar 21 2026 12:28:20 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వీహెచ్ ఆగ్రహం....సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవర్టులున్నారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తో కాంగ్రెస్ పార్టీలో కొందరికి లోపాయికారీ ఒప్పందం ఉందన్నారు. తనకు ప్రచార కమిటీలో స్థానం కల్పించకపోవడంపై ఆయన మనస్థాంప చెందారు. తాను ప్రచారవాహనాన్ని కూడా సిద్ధం చేసుకున్నానన్నారు.తాను ఇంట్లోకూర్చునే వాడిని కాదని, త్వరలోనే కేసీఆర్ కోవర్టులెవరో బయపెడతానని హెచ్చరించారు. తనకు ప్రచార కమిటీలో స్థానం కల్పిస్తామని కుంతియా కూడా హామీ ఇచ్చారన్నారు. వీహెచ్ ఆగ్రహంతో ఒక్కసారిగా కాంగ్రెస్ లో కలకలం రేగింది. మరి పార్టీ వీహెచ్ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
Next Story

